లింగమనేని రమేష్‌తో వంగవీటి రాధా భేటీ
కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చ... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రణాళికలు... మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచన...

విజయవాడ, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ (రాధా), జనసేన రాజ్యసభ సభ్యుడు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడు లింగమనేని రమేష్‌తో మంగళవారం భేటీ అయ్యారు. విజయవాడలోని లింగమనేని రమేష్ నివాసానికి వెళ్లిన రాధా ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని లింగమనేని రమేష్ సూచించారు. డివిజన్లవారీగా ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించడంతోపాటు కూటమి పార్టీల మధ్య ఐక్యతను కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడిగా జనసేన పార్టీ నియమించిన లింగమనేని రమేష్‌తో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా సమావేశం కావడం ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

