ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

'ఆర్నబ్' తుఫాన్‌పై ఎన్టీఆర్ జిల్లా హైఅలర్ట్!

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు... 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 10:05 AMకి 3,272 వీక్షణలు
'ఆర్నబ్' తుఫాన్‌పై ఎన్టీఆర్ జిల్లా హైఅలర్ట్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఆర్నబ్' తుఫాన్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, తీవ్ర ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముంపు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాల్లో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులకు ముందస్తు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా పడవలు, పర్యాటక బోట్ల రాకపోకలతోపాటు గేమ్ పార్కుల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఉధృతంగా ప్రవహించే కాలువలు, చెరువులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. చెట్లు, శిథిల భవనాలు, తాత్కాలిక షెడ్ల కింద ఆశ్రయం పొందవద్దన్నారు. రైతులు కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పశువులను సురక్షిత పాకల్లో ఉంచాలని సూచించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా అక్టోబర్ 27, 28 తేదీల్లో జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. విద్యాసంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లలోనే ఉంచాలని, విహారయాత్రలకు పంపవద్దని సూచించారు. తుఫాన్‌పై సామాజిక మాధ్యమాల్లో వదంతులు,అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాన్ సమాచారం, అత్యవసర సహాయక చర్యల కోసం కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 91549 70454 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

లింగమనేని రమేష్‌తో వంగవీటి రాధా భేటీ

1 గంట క్రితం 3,270

80వ డివిజన్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 3,677

అభివృద్ధి, సంక్షేమమే మా శ్రీరామరక్ష!

1 గంట క్రితం 3,576

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 45 సార్లు బాంబు బెదిరింపులు!

3 గంటల క్రితం 2,691