ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పశ్చిమలో పెండింగ్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష… కాళేశ్వరరావు మార్కెట్‌, వస్త్రలత కాంప్లెక్స్‌ పునరభివృద్ధిపై చర్చ… కొండ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు, వరద నీటి కాలువల పనులపై దృష్టి…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 4:32 PMకి 3,329 వీక్షణలు
పశ్చిమలో పెండింగ్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్లలో నిలిచిపోయిన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు. భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మంగళవారం విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరరావు మార్కెట్‌, వస్త్రలత కాంప్లెక్స్‌ పునరభివృద్ధి, కొండ ప్రాంత వాసులకు నిరంతరం స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. శ్మశానవాటికలు, పార్కుల అభివృద్ధి, నదీతీర సుందరీకరణతోపాటు పెండింగ్‌లో ఉన్న వరద నీటి కాలువల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ గ్రాంట్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ ప్రత్యేక అధికారి ఎం.మధు, చీఫ్‌ ఇంజనీర్‌ సత్యకుమారి, సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ ఇంజనీర్లు పురుషోత్తం, కరుణాకర్‌, నియోజకవర్గ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

20 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901