ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ15, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పశ్చిమలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

పేజ్జోనిపేటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రత్తిపాటి శ్రీధర్ దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి భవానీపురం రైతుబజార్‌లోనూ ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

V10TV న్యూస్ డెస్క్ 15 ఆగస్టు, 2026 7:42 PMకి 1 వీక్షణలు
పశ్చిమలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్ ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. పేజ్జోనిపేటలో దామోదరం సంజీవయ్య సేవాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య సేవాదళం అధ్యక్షుడు ఎం. ధైర్యానంద్, ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల బాల, మల్లెల సురేష్, దాస్ మేరీ సుజాత, బొందలపాటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అలాగే భవానీపురం రైతుబజార్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో సుజనా న్యాయమిత్ర బాయన హేరంబ కుమార్, ఈఓ కరుణాకర్, రైతుబజార్ సిబ్బంది, స్టాల్ హోల్డర్లు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జ్యోతిర్మయి–సునీల్‌కు అప్పన వెంకట సత్యసాయిబాబు దంపతుల పెళ్లి కానుకలు

19 నిమిషాల క్రితం 2

సరస్వతి పుత్రుడిగా వసంత వెంకట కృష్ణప్రసాద్..!

2 గంటల క్రితం 2

పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం

4 గంటల క్రితం 1,237

దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ

4 గంటల క్రితం 3,756