జ్యోతిర్మయి–సునీల్‌కు అప్పన వెంకట సత్యసాయిబాబు దంపతుల పెళ్లి కానుకలు
బంగారు మంగళసూత్రాలు, మెట్టెలు అందించిన అప్పన వెంకట సత్యసాయిబాబు–వెంకట మధురవాణి పట్టు వస్త్రాలు, పండ్లతో నూతన వధూవరులకు ఆశీస్సులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

విజయవాడ ఆగస్టు 15 (V10TV AP): నూతన వధూవరులు జ్యోతిర్మయి–సునీల్ వివాహాన్ని పురస్కరించుకుని లయన్ అప్పన వెంకట సత్యసాయిబాబు, వెంకట మధురవాణి దంపతులు బంగారు మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, పండ్లను అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆగస్టు 16న అర్ధరాత్రి 12.26 గంటలకు విజయవాడ స్వాతి సెంటర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితిలో జ్యోతిర్మయి–సునీల్ వివాహం జరగనున్న సందర్భంగా శనివారం ఈ వివాహ కానుకలను అందజేశారు. జ్యోతిర్మయి–సునీల్ దంపతులు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని అప్పన వెంకట సత్యసాయిబాబు, వెంకట మధురవాణి ఆకాంక్షించారు. అప్పన వెంకట సత్యసాయిబాబు విజయవాడ సుప్రీమ్ లయన్స్ క్లబ్‌కు చెందినవారిగా, అప్పన వెంకటకృష్ణయ్య–కామేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

