ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ22, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దేవరగట్టు కర్రల సంబరంలో హింస.. ఒకరు మృతి

కర్రల దాడిలో ఒకరి మృతి... 100 మందికిపైగా గాయాలు... బన్ని జైత్రయాత్రలో ఉద్రిక్తత...

V10TV న్యూస్ డెస్క్ 22 అక్టోబర్, 2026 3:07 PMకి 2 వీక్షణలు
దేవరగట్టు కర్రల సంబరంలో హింస.. ఒకరు మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఆలూరు గ్రామీణ, అక్టోబర్ 22 : కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన కర్రల సంబరంలో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఆలూరుకు చెందిన పోతురాజు (28) మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. తొలుత దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవమూర్తులను కిందనున్న సింహాసనం కట్ట వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల తర్వాత స్వామివార్ల బన్ని జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు కర్రలు, దివిటీలతో సంబరంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపులో ఒక్కసారిగా హింస చెలరేగింది. కర్రలతో జరిగిన దాడుల్లో పలువురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 100 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్రల దాడిలో తీవ్రంగా గాయపడిన పోతురాజు మృతి చెందినట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రెబల్స్ బరిలో ఉంటే సస్పెన్షన్ తప్పదు

2 గంటల క్రితం 3,598

ఎడ్లపాడులో వైసీపీ–టీడీపీ వర్గీయుల ఘర్షణ

2 గంటల క్రితం 3,513

కూటమి విజయమే లక్ష్యం

3 గంటల క్రితం 3,248

ట్రాఫిక్ నియంత్రణలో బెజవాడ పోలీసుల సత్తా

5 గంటల క్రితం 5,803