ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఏపీలో నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 48 గంటలపాటు మూసివేత… అక్టోబర్ 30 సాయంత్రం 5 నుంచి నవంబర్ 1 సాయంత్రం 5 వరకు ఆంక్షలు… నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా మరోసారి మద్యం విక్రయాలపై నిషేధం…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 11:30 AMకి 4,818 వీక్షణలు
ఏపీలో నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నవంబర్ 1న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటలపాటు మద్యం విక్రయాలను నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉండనుంది. మద్యం దుకాణాలతోపాటు బార్లలో కూడా విక్రయాలను నిలిపివేయనున్నారు. అలాగే నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

3 నిమిషాల క్రితం 6,580

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

43 నిమిషాల క్రితం 5,371

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

52 నిమిషాల క్రితం 6,871

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

57 నిమిషాల క్రితం 4,563