ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!
తుది దశకు చేరుకున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ… ఈ నెల 29న ఎన్నికల అధికారులకు ముద్రించిన జాబితాలు… అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితా విడుదల…

అమరావతి, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఓటర్ల జాబితాల ముద్రణ ప్రారంభం కానుంది. ఇప్పటికే దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 28 నాటికి ముద్రణ పూర్తి చేసి, 29న సంబంధిత ఎన్నికల అధికారులకు జాబితాలను అందజేయనున్నారు. అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు. అనంతరం ఓటర్లు తమ పేర్లు, వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు.

