డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 కోట్ల భారీ మోసం
విశ్రాంత ఇంజినీర్‌ను భయపెట్టిన సైబర్ నేరగాళ్లు రెండు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ నిందితుల ఖాతాల్లోని రూ.7 కోట్లు నిలుపుదల

విజయవాడ, సెప్టెంబర్ 30: నగరంలోని గురునానక్ కాలనీకి చెందిన విశ్రాంత ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.10 కోట్లు కాజేశారు. బాధితుడికి ఫోన్ చేసి భయాందోళనకు గురిచేస్తూ రెండు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నారు. మరింత నగదు డిమాండ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల ఖాతాల్లోని రూ.7 కోట్లను నిలుపుదల చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

