ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటి ప్రచారం

కూటమి అభ్యర్థి తిరుపతి అనూషకు మద్దతుగా జనసేన శ్రేణుల ప్రచారం… మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి… స్థానిక సమస్యల పరిష్కారం, డివిజన్ అభివృద్ధే లక్ష్యమని వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 19 అక్టోబర్, 2026 6:56 PMకి 3,890 వీక్షణలు
39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటి ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 19: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 39వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి తిరుపతి అనూష సోమవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయం ఎంతో అవసరమన్నారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు ఒక ఓటు, 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మరో ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్‌లోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అనూష తెలిపారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని పేర్కొన్నారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు తనను గెలిపించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గుడ్లవల్లేరులో వైసీపీకి బిగ్‌ షాక్‌!

27 నిమిషాల క్రితం 2,753

76వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిని గెలిపించాలి: బొండా ఉమా

1 గంట క్రితం 4,083

దుర్గమ్మ భక్తులకు ఉచిత వైద్య సేవలు

4 గంటల క్రితం 3,582

దివ్యాంగులకు సులభంగా దుర్గమ్మ దర్శనం

4 గంటల క్రితం 2,419