ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మ భక్తులకు ఉచిత వైద్య సేవలు

కొండపైన, దిగువన వైద్య శిబిరాల ఏర్పాటు… అస్వస్థతకు గురైన భక్తులకు తక్షణ ప్రాథమిక చికిత్స… ఈవో శీనా నాయక్‌ ఆదేశాలతో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి…

V10TV న్యూస్ డెస్క్ 19 అక్టోబర్, 2026 4:24 PMకి 3,580 వీక్షణలు
దుర్గమ్మ భక్తులకు ఉచిత వైద్య సేవలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 20: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఆలయ ఈవో శీనా నాయక్‌ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపైన, కొండ దిగువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారు. క్యూలైన్లలో, ఇతర ప్రాంతాల్లో అలసట, అస్వస్థతకు గురైన భక్తులను వైద్య శిబిరాలకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి వెంటనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు కూడా ఉన్నారు. వైద్య సహాయం అవసరమైన వారికి సకాలంలో సేవలందిస్తూ ఉపశమనం కలిగించేందుకు వైద్య బృందాలు కృషి చేస్తున్నాయి. ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వైద్య సదుపాయాలు కల్పించిన ఈవో శీనా నాయక్‌, దేవస్థానం అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బందిని అభినందించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

దివ్యాంగులకు సులభంగా దుర్గమ్మ దర్శనం

2 గంటల క్రితం 2,417

చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి

2 గంటల క్రితం 2,680

విజయవాడ అభివృద్ధి కూటమితోనే సాధ్యం

3 గంటల క్రితం 4,190

గుడివాడలో నెల రోజుల ధనుర్మాస వైభవం

4 గంటల క్రితం 3,582