76వ డివిజన్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలి: బొండా ఉమా
గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం… ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపు… సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి…

76వ డివిజన్ అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరాజు ప్రజలతో మమేకమై నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు. రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం, పింఛన్లు, ఇంటి పట్టాల విషయంలో ప్రజలకు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినే కూటమి అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. ప్రజాప్రతినిధి పదవి అలంకారం కాదని, ప్రజాసేవకు లభించిన బాధ్యత అని బొండా ఉమా పేర్కొన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్, టీడీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, క్లస్టర్ ఇన్చార్జి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షుడు లక్కం రాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి భద్రం, కర్ణం వెంకటరమణ, నాగమణి, వెలగపూడి శ్రీను, కోనేరు అనురాధతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

