కృష్ణాజిల్లాలో మూడు జడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణ!
26 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 197 నామినేషన్లు... టీడీపీకి చెందిన రెండు, బీజేపీకి చెందిన ఒక నామినేషన్ తిరస్కరణ... పరిశీలన అనంతరం 194 నామినేషన్లకు అధికారుల ఆమోదం...

మచిలీపట్నం, అక్టోబర్ 24 : కృష్ణాజిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం నామినేషన్ పత్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 26 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 197 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వివిధ కారణాలతో మూడు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు, భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నామినేషన్ ఉన్నాయి. మిగిలిన 194 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది.

