ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

చదువుతోనే ఉన్నత శిఖరాలకు!

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి... క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి... నున్న పోలీస్ స్టేషన్ సీఐ ఉమర్ పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 14 నవంబర్, 2026 7:40 PMకి 9,725 వీక్షణలు
చదువుతోనే ఉన్నత శిఖరాలకు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, నవంబర్ 14: విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని నున్న పోలీస్ స్టేషన్ సీఐ ఉమర్ సూచించారు. శనివారం స్థానిక ఎస్.జి. కిడ్స్ స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ ఉమర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ రాజ్య, పూర్ణ పవన్ దంపతులు సీఐ ఉమర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు సీఐ ఉమర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288