పవన్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో పూర్తికావచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఆహ్వానం... ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొంగూరు నారాయణ... అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన మంత్రి.. ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పవన్ సానుకూలత...

అమరావతి: రాజధాని అమరావతిలో పూర్తికావచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి, శాసనసభ్యుల గృహ సముదాయాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు.
బుధవారం పవన్ కల్యాణ్‌ను కలిసిన మంత్రి నారాయణ రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జితో పాటు శాసనసభ్యుల గృహ సముదాయాల పనులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
త్వరలో నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరగా పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
separate photo from news

