ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ అధికారి మృతి!
ఏపీవోగా విధులు నిర్వహిస్తుండగా హరితగౌడ్కు గుండెపోటు... ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూత... రాయదుర్గం మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హరితగౌడ్...

అనంతపురం, నవంబర్ 5: అనంతపురం జిల్లాలో ఎన్నికల విధుల్లో విషాదం చోటుచేసుకుంది. కూడేరు మండలం కాడదారకుంటలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా (ఏపీవో) విధులు నిర్వహిస్తున్న హరితగౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. పోలింగ్ విధుల్లో ఉన్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కూడేరు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. హరితగౌడ్ రాయదుర్గం మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా మృతి చెందడం విషాదాన్ని నింపింది.

