ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి: న్యాయమూర్తి ఎస్. వరలక్ష్మి

మచిలీపట్నంలో న్యాయ విజ్ఞాన సదస్సు.. విద్యార్థులకు చట్టాలపై అవగాహన... సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రతకు పోక్సో చట్టం కీలకమని సూచన...

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 9:51 PMకి 701 వీక్షణలు
హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి: న్యాయమూర్తి ఎస్. వరలక్ష్మి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, ఆగస్టు 7 (వి10టీవీ): భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు కల్పించినట్లే వాటికి అనుగుణంగా బాధ్యతలను కూడా తెలుసుకుని పాటించాలని కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వరలక్ష్మి అన్నారు.

రాష్ట్ర హైకోర్టు పిలుపు మేరకు మచిలీపట్నంలోని లేడీ యాంప్తుల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొక్కలు నాటి అనంతరం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు.

మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని, ముఖ్యంగా 18 ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోక్సో చట్టం తీసుకువచ్చారని వివరించారు. ఈ చట్టం కింద కేసులను జిల్లా జడ్జి స్థాయి న్యాయమూర్తి విచారిస్తారని, బాధితుల గోప్యతకు భంగం కలగకుండా ప్రత్యేక విధానంలో విచారణ జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులు నైతిక విలువలతో ఎదిగి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికల ద్వారా అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు **'గుడ్ టచ్ – బ్యాడ్ టచ్'**పై అవగాహన కల్పించాలని సూచించారు.

వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. చట్టపరమైన సందేహాల నివృత్తి కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించి ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, కళాశాల ప్రిన్సిపాల్ పీ. లక్ష్మి, కృష్ణా యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మద్దాల శ్రావణి, మచిలీపట్నం సిటీ కేబుల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ లంకిశెట్టి హరినాథ్ బాబు, న్యాయవాది లంకిశెట్టి సాయిపాణి, మాజీ కౌన్సిలర్ వనజ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో ‘ఫుడ్ మాఫియా’..! ప్రజల ప్రాణాలతో చెలగాటం

4 నిమిషాల క్రితం 1

సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష

14 నిమిషాల క్రితం 1

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

1 గంట క్రితం 1

“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్

1 గంట క్రితం 3