ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సాయికృష్ణ కేసులో మరో కీలక అరెస్ట్

కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకటేష్ అదుపులోకి... సీసీ ఫుటేజ్ తొలగింపుపై దృష్టి సారించిన సిట్ అధికారులు... వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరు...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 7:04 PMకి 1 వీక్షణలు
సాయికృష్ణ కేసులో మరో కీలక అరెస్ట్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పనిచేసిన వెంకటేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ కేసు విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్‌కు సంబంధించిన అంశంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీఐ నాగరాజు ఆదేశాలతో సీసీ ఫుటేజ్‌ను తొలగించినట్లు విచారణలో గుర్తించిన నేపథ్యంలో వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీ కెమెరాల రికార్డింగ్, ఫుటేజ్ తొలగింపు తదితర అంశాలపై అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వెంకటేష్‌ను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు సమాచారం. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న

1 గంట క్రితం 1

54వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ ప్రచారం పూర్తి

1 గంట క్రితం 2

డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో

1 గంట క్రితం 1

విద్యా హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: ఏఐఎస్ఎఫ్

1 గంట క్రితం 1