54వ డివిజన్లో ఇంటింటికీ టీడీపీ ప్రచారం పూర్తి
కూటమి రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వివరించిన నేతలు బుద్దా వెంకన్న సారథ్యంలో 54వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు డివిజన్ అధ్యక్షుడు షేక్ తారిక్ అజీజ్ కృతజ్ఞతలు

విజయవాడ: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్లో చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ ప్రచారం పూర్తయింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ తారిక్ అజీజ్ తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సూచనలతో, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్దా వెంకన్న సారథ్యంలో 54వ డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించినట్లు పేర్కొన్నారు. డివిజన్లో ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన వివిధ హోదాల్లోని పార్టీ నాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ ఇంచార్జ్లు, బూత్ ఇంచార్జ్లు, పార్టీ కార్యకర్తలకు షేక్ తారిక్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.

