ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న

42వ డివిజన్‌లో అప్నా బజార్ రోడ్డు నుంచి స్వాతి థియేటర్ రోడ్డు వరకు ర్యాలీ... జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటిచెప్పే కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం: బుద్ధా వెంకన్న దేశ అభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 7:23 PMకి 1 వీక్షణలు
తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న — చిత్రం 1
తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ: జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. 42వ డివిజన్ పరిధిలోని అప్నా బజార్ రోడ్డు నుంచి స్వాతి థియేటర్ రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో మరింత పెంపొందించేందుకు తిరంగ ర్యాలీ వంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జాతీయ జెండా

తిరంగ ర్యాలీలో పాల్గొన్న బుద్ధా వెంకన్న — అదనపు చిత్రం 2

దేశ ఐక్యతకు, సమైక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. కార్యక్రమంలో 42వ డివిజన్ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, క్లస్టర్ యేదుపాటి రామయ్య, పి. చిన్న సుబ్బయ్య, బాలు, శివ, సంతోష్, ముదిరాజ్ శివాజీతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

54వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ ప్రచారం పూర్తి

1 గంట క్రితం 2

డ్రగ్స్ వద్దు బ్రో.. ఆరోగ్యం ముద్దు బ్రో

1 గంట క్రితం 1

విద్యా హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: ఏఐఎస్ఎఫ్

1 గంట క్రితం 1

గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు

2 గంటల క్రితం 2