రామవరప్పాడు రింగ్‌లో టాక్సీ యజమానుల ‘జులుం’..!
తాము తప్ప మరో టాక్సీ ప్రయాణికులను ఎక్కించకూడదంటూ హుకుం? ఇతర టాక్సీలు ఆగితే డ్రైవర్లతో వాగ్వాదం.. ప్రయాణికులను దించేస్తున్నారని ఆరోపణలు ‘రింగ్ సెంటర్ వారి సొత్తా?.. ప్రత్యేక యూనియన్‌కు అనుమతి ఉందా?’ అంటూ బాధితుల ప్రశ్నలు...

వీ10టీవీ – విజయవాడ: విజయవాడలో అత్యంత కీలకమైన రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద కొందరు టాక్సీ యజమానుల వ్యవహారశైలిపై ఇతర టాక్సీ డ్రైవర్ల నుంచి తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకునే విషయంలో స్థానికంగా ఉండే కొందరు టాక్సీ డ్రైవర్లు తమదే ఆధిపత్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలియని ఇతర ప్రాంతాల టాక్సీ డ్రైవర్లు రింగ్ సెంటర్ వద్ద వాహనం ఆపి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరుష పదజాలంతో దూషించడంతో పాటు వాహనాల్లో ఎక్కిన ప్రయాణికులను సైతం కిందకు దించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రామవరప్పాడు రింగ్‌ను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారికంగా నగరంలోని ముఖ్యమైన జంక్షన్లలో ఒకటిగా పేర్కొంది. � ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశంలో ఏదైనా ప్రత్యేక టాక్సీ స్టాండ్‌కు అధికారిక అనుమతి ఉందా? ఉంటే ఎవరికి కేటాయించారు? ఇతర టాక్సీలు ప్రయాణికులను ఎక్కించుకోకుండా అడ్డుకునే అధికారం ఎవరికైనా ఉందా? అనే అంశాలపై రవాణా, ట్రాఫిక్ అధికారులు స్పష్టత ఇవ్వాలని బాధిత టాక్సీ డ్రైవర్లు కోరుతున్నారు. Vijayawada Police

