ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అఫీఫా అకాల మృతిపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత అఫీఫా అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన కుటుంబ సభ్యులను ఓదార్చి.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి

V10TV న్యూస్ డెస్క్ 11 ఆగస్టు, 2026 5:40 PMకి 2,539 వీక్షణలు
అఫీఫా అకాల మృతిపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి — చిత్రం 1
అఫీఫా అకాల మృతిపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

వీ10టీవీ – విజయవాడ: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా (24) అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని షిరీన్ బేగం నివాసానికి వెళ్లిన హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు. కుమార్తెను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న షిరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు. చీరాల బీచ్‌కు వెళ్తుండగా ఏటుకూరు

అఫీఫా అకాల మృతిపై హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి — అదనపు చిత్రం 2

బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో 24 ఏళ్ల అఫీఫా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా పూడ్చలేని లోటు.. తీరని వేదన’’ అని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తీరుతో పాటు గాయపడిన వారి వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అఫీఫా మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన అనిత, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, మనోస్థైర్యాన్ని భగవంతుడు షిరీన్ బేగం కుటుంబానికి ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రామవరప్పాడు రింగ్‌లో టాక్సీ యజమానుల ‘జులుం’..!

2 గంటల క్రితం 2,586

మాలల హక్కుల కోసం మహా పోరు

3 గంటల క్రితం 2,751

గర్భిణీల గుండెకు ‘సుజనా’ భరోసా

3 గంటల క్రితం 1,215

వెల్లంపల్లిపై విమర్శలు చేస్తే ఖబడ్దార్!

4 గంటల క్రితం 1,753