మచిలీపట్నంలో ఘనంగా ‘ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం’
▪️ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ: రుద్రపోగు సురేష్ మాదిగ ▪️ కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పేదలకు ఆరోగ్య భరోసా కల్పించిన పథకమని వెల్లడి ▪️ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV మచిలీపట్నం:
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా నాయకుడు కొల్లూరి బసవ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కృష్ణాజిల్లా ఇన్‌చార్జ్ రుద్రపోగు సురేష్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రుద్రపోగు సురేష్ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సాగించిన పోరాటం ఫలితంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చిందన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా తెల్ల రేషన్‌కార్డు కలిగిన పేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రావడంలో మందకృష్ణ మాదిగ పోరాటం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

ఎస్సీల్లోని 59 ఉపకులాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య భరోసా లభిస్తోందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో సాగించిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో కొమ్ము ప్రసాద్, పేటేటి ప్రభాకర్, కొల్లూరి బసవ, కొక్కిలిగడ్డ నవీన్, మౌళి, పసుమర్తి దినేష్, భాస్కరరావు, చిట్టూరి యువరాజు, చీలి సుమన్ కుమార్, బండారు సోమేశ్వరరావు, మట్ట గోపాలకృష్ణ మాదిగ, చిట్టూరి అర్జునరావు, పోతురాజు, కైతేపల్లి రాజేష్‌తో పాటు వివిధ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలకు చెందిన నాయకులు, మాదిగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

