చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు
మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం... ఆర్థిక వ్యవహారాలపై విడదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని వ్యాఖ్య... గవర్నెన్స్ బాగుంటేనే ఫలితాలు ప్రజా జీవితంలో కనిపిస్తాయని స్పష్టీకరణ...

అమరావతి: చట్ట వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని పేర్కొన్నారు. దాని ప్రజెంటేషన్‌పై తాను సుమారు పది గంటల పాటు అధ్యయనం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాలన మెరుగ్గా ఉంటే దాని ఫలితాలు ప్రజల రోజువారీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని చంద్రబాబు వివరించారు.

