అమరావతి రైతులపై మీకు ప్రేమ ఉందా: పేర్ని నాని
సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు... రోడ్డు వేయడానికి ఎన్నేళ్లు పట్టిందంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు... రాజధాని అమరావతి పేరుతో రైతులను కాల్చుకు తింటున్నారని ఆరోపణ...

విజయవాడ: అమరావతి రైతులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉందా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు వేయడానికి ఎన్నేళ్లు పట్టిందని ప్రశ్నించిన పేర్ని నాని.. రాజధాని అమరావతి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రం మొత్తం దోచుకుంటున్నారని ఆరోపించారు. తమ వ్యాపారాల కోసం రైతులను కాల్చుకు తింటున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా సానుభూతి ఉంటే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

