ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ14, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

మార్చిలో జాతికి అంకితం కానున్న మచిలీపట్నం పోర్టు

బందరు ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసే దిశగా వేగంగా పనులు ‘గేట్ వే ఆఫ్ అమరావతి’గా మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి ప్రణాళిక కృష్ణా జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దుతాం

V10TV న్యూస్ డెస్క్ 14 ఆగస్టు, 2026 5:38 PMకి 1 వీక్షణలు
మార్చిలో జాతికి అంకితం కానున్న మచిలీపట్నం పోర్టు — చిత్రం 1
మార్చిలో జాతికి అంకితం కానున్న మచిలీపట్నం పోర్టు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

V10TV AP | మచిలీపట్నం | ఆగస్టు 14, 2026 బందరు ప్రజల చిరకాల వాంఛగా, కృష్ణా జిల్లా చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచే మచిలీపట్నం పోర్టును వచ్చే మార్చి నాటికి జాతికి అంకితం చేసే లక్ష్యంతో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. పోర్టు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి, ప్రస్తుత పురోగతిపై సమీక్షించారు. ఎన్నో పోరాటాల అనంతరం బందరు పోర్టును సాకారం చేసుకున్నామని, అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోర్టు పనులను గాలికి వదిలేశారని విమర్శించారు. బందరు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు పనులకు వేగం పెంచిందని

మార్చిలో జాతికి అంకితం కానున్న మచిలీపట్నం పోర్టు — అదనపు చిత్రం 2

పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలోనూ మచిలీపట్నం పోర్టు కీలక పాత్ర పోషించేలా **‘గేట్ వే ఆఫ్ అమరావతి’**గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా కృష్ణా జిల్లా ప్రతిష్ఠకు తార్కాణంగా నిలిచే మచిలీపట్నం పోర్టును మార్చిలో జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధితో పాటు కృష్ణా జిల్లా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టును జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

2 గంటల క్రితం 0

పీహెచ్‌డీ సాధించిన డా. నూనె ధనుంజయరావుకు అభినందనలు

2 గంటల క్రితం 1,237

కార్యాలయంతో టీడీపీకి మరింత బలం

4 గంటల క్రితం 1,464

కళ్లకు కనిపించి.. మనసును కదిలించిన ఛాయాచిత్రాలు

6 గంటల క్రితం 1,358