పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం మాలెంపాటి ఉదయభాస్కర్‌రావు పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటిన కూటమి నేతలు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యతని పిలుపు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV AP | విజయవాడ | ఆగస్టు 14, 2026 పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్‌లో శుక్రవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మాలెంపాటి ఉదయభాస్కర్‌రావు పాఠశాల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి,

పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో 39వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. శివ, క్లస్టర్ ఇన్‌చార్జ్ బడుగు గణేష్, ఉపాధ్యక్షుడు నెల్లూరి వీర్రాజు, కోశాధికారి నక్కా కృష్ణ, యూనిట్ ఇన్‌చార్జ్ ముద్దాని దుర్గాప్రసాద్, బూత్ కన్వీనర్లు రెంటపల్లి రవికుమార్, రామిశెట్టి విజయ్, నేరెళ్ళ నవీన్, యనమండ్ర గుణశేఖర్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాస్, బీజేపీ మండలాధ్యక్షుడు వేలుమూరి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడాన్ని ఒకరోజు కార్యక్రమంగా కాకుండా వాటిని నిరంతరం సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నాయకులు కోరారు.

