ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి… ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి… ప్రజలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 10:32 AMకి 3,972 వీక్షణలు
శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి — చిత్రం 1
శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గుడివాడ, అక్టోబర్ 10: గుడివాడ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత పెంపొందించేలా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. ఆదివారం నుంచి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో దేవాదాయ శాఖ అధికారులు, వివిధ ఆలయాల కమిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల వద్ద పారిశుధ్యం, తాగునీరు, క్యూలైన్లు, భక్తుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నవరాత్రి ఉత్సవాలుఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని సూచించారు.

శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి — అదనపు చిత్రం 2

ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం వివిధ ఆలయాల నవరాత్రి ఉత్సవాల బుక్లెట్లను ఆవిష్కరించారు. వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య,ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని సూచించారు. ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం వివిధ ఆలయాల నవరాత్రి ఉత్సవాల బుక్లెట్లను ఆవిష్కరించారు. వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

21 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901