ఎస్ఎస్డీ టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన
▪️ తిరుమల శ్రీవారి ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీకి నిర్దిష్ట సమయం లేదని స్పష్టీకరణ... ▪️ భక్తుల రద్దీ, నిర్వహణ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు సమయాల నిర్ణయం... ▪️ అధికారిక అప్డేట్స్ గమనించి తిరుమల యాత్రకు ప్రణాళిక చేసుకోవాలని సూచన...

తిరుమల: శ్రీవారి ఉచిత సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీ సమయాలపై టీటీడీ కీలక స్పష్టత ఇచ్చింది. టోకెన్ల జారీకి ప్రతిరోజూ ఒకే విధమైన నిర్దిష్ట సమయం ఉండదని తెలిపింది. కొండపై భక్తుల రద్దీ, నిర్వహణ అవసరాలు తదితర పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు టోకెన్ల జారీ సమయాలను నిర్ణయిస్తామని పేర్కొంది. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మకుండా టీటీడీ అధికారిక సమాచారాన్ని గమనించి తమ తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.

