స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు దేశానికి స్ఫూర్తి: బాజీ బాబా
ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఎస్ గ్రాండ్ అధినేత సయ్యద్ నాసర్ పేదలు, చిన్నారులకు పండ్లు, మిఠాయిలు, చాక్లెట్ల పంపిణీ

ఆగస్టు 15 (V10TV AP): స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకుడు బాజీ బాబా అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గణపతిరావు రోడ్డులో ఉన్న ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ గ్రాండ్ అధినేత సయ్యద్ నాసర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాజీ బాబా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మనకు స్ఫూర్తి అని, వారి సేవలు దేశానికి గర్వకారణమని అన్నారు. వారి ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల అమూల్యమైన త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలు, చిన్నారులకు పండ్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు సయ్యద్ ఖాదర్, షబ్బీర్ అలీ, సయ్యద్ అబ్బాస్, అన్సారీ బేగ్, సయ్యద్ అన్సార్, సయ్యద్ అమ్జద్, సయ్యద్ ముజీబ్, నసీర్, సమీర్, శివ, ఎండీ ఖాదర్, రషీద్ పాషా, షేక్ అన్వర్, వెంకన్న, నాగేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.

