దుర్గగుడి ఈఓ శీనా నాయక్‌కు ఉత్తమ సేవా పురస్కారం
మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మెరిటోరియస్ సేవా ప్రశంసాపత్రం అందుకున్న ఈఓ భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, పరిపాలనా సేవలకు దక్కిన ప్రత్యేక గుర్తింపు అవార్డు ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సహా ఉన్నతాధికారులు

ఆగస్టు 15 (V10TV AP): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. విజయవాడలో నిర్వహించిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మెరిటోరియస్ సేవా ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు. దుర్గగుడి ఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి శీనా నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై రద్దీ నియంత్రణ, నిరంతర భద్రతా పర్యవేక్షణ, శరన్నవరాత్రి ఉత్సవాలకు ముందస్తు ప్రణాళిక, ఆలయ పరిసరాల ఆధునీకరణ వంటి అంశాల్లో ఆయన చూపిన చొరవకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. భక్తులకు అందించే సేవల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆలయ పరిపాలనలో సేవా దృక్పథాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని శీనా నాయక్‌ను ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, పోలీస్ కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శీనా నాయక్ పురస్కారం అందుకోవడంపై ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

