ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మకు ఆషాఢ మాసం సారె

కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న అడ్డూరి శ్రీరామ్ పసుపు, కుంకుమ, చీర, పండ్లు, స్వీట్లతో సారె సమర్పణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 10:23 PMకి 1 వీక్షణలు
దుర్గమ్మకు ఆషాఢ మాసం సారె — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సారె సమర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న అడ్డూరి శ్రీరామ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పసుపు, కుంకుమ, పువ్వులు, చీర, స్వీట్లు, పండ్లతో కూడిన సారెను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు ఆషాఢ మాసం సారె సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి, కానూరి మాధవి, చిగురుపాటి లక్ష్మి, బొడ్డు నాగలక్ష్మి, కర్రి నాగలక్ష్మి, పోలె శాంతి, జి. స్వరూపారాణి, యర్రా సునీత, పద్మజ, చల్లా రమాదేవి, వసుంధర, మన్నే రమ, రాజేశ్వరి తదితర బీజేపీ మహిళా నాయకులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయవాడ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

1 గంట క్రితం 2

క్రిమినల్ కేసుల కాపీల్లో కీలక మార్పు

2 గంటల క్రితం 2

ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండ

2 గంటల క్రితం 1

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సరికొత్త భద్రత

5 గంటల క్రితం 2