అదే జరిగితే తెలంగాణలో జనసేన ఒంటరి పోటీ: శంకర్ గౌడ్
బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్. పొత్తుల అంశాన్ని పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం. బీజేపీతో పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడి.

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీపై ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పొత్తుల అంశంపై తుది నిర్ణయం జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం స్థాయిలో ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి నేతల పరిధిలో పొత్తుల నిర్ణయం ఉండదని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పారు. రాష్ట్రంలో జనసేనకు ఆదరణ పెరుగుతోందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.
