కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేరు: కేటీఆర్
కాంగ్రెస్ నేతల వరుణ యాగాలపై కేటీఆర్ స్పందన... దైవకృపతో పాటు సొంత ప్రయత్నమూ ఉండాలని వ్యాఖ్య... పూజలతో పాటు ప్రజల పట్ల బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని హితవు...

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న వరుణ యాగాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. దైవకృపను కోరుకోవడంతో పాటు ప్రభుత్వం తనవంతు ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుడిని ప్రార్థించడం తప్పు కాదని, అయితే పూజలు, యాగాలతోనే సరిపెట్టకుండా ప్రజల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని కేటీఆర్ సూచించారు.

