ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గిరిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు!

ప్రముఖ నటుడి మృతికి వైఎస్ జగన్ తీవ్ర సంతాపం... విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర... సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం...

V10TV న్యూస్ డెస్క్ 15 నవంబర్, 2026 12:35 PMకి 6,878 వీక్షణలు
గిరిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తాడేపల్లి, నవంబర్ 14: ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిబాబు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని జగన్ కొనియాడారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలకు జీవం పోసిన గిరిబాబు సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288