హైసీ జగన్‌కు మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్
మాజీ సీఎం జగన్ దేవరుపల్లి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు... అధికారంలో ఉన్నప్పుడే చాంపియన్‌లా మాట్లాడాల్సిందని వ్యాఖ్య... గతంలో చేసిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలపై ప్రశ్నల వర్షం...

అమరావతి, ఆగస్టు 5 (వి10టీవీ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేవరుపల్లి పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. హోదాలో ఉన్నప్పుడు రైతుల సమస్యలపై చాంపియన్‌లా వ్యవహరించాల్సిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 12.9 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి, ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో కేవలం 25 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి రైతులకు తగిన స్థాయిలో మద్దతు అందించలేదని ఆరోపించారు.
రైతుల సంక్షేమంపై మాట్లాడే ముందు గత పాలనలో చేసిన పనులను ప్రజలకు వివరించాలని, ప్రస్తుతం చేస్తున్న విమర్శలకు ప్రజలే సరైన తీర్పు చెబుతారని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.

