ఒక్కో మనిషిపై రూ.2 లక్షల అప్పు..!
ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు... రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్... ప్రజల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వ్యాఖ్య..

విజయవాడ, ఆగస్టు 5 (వి10టివి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల కారణంగా ప్రతి పౌరుడిపై సుమారు రూ.2 లక్షల భారం పడిందని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎంత అప్పు తీసుకుంది, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.
అదేవిధంగా, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని షర్మిల పేర్కొన్నారు.

