ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇంద్రకీలాద్రి శోభ!

పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా అమ్మవారి ప్రతిరూపం ఏర్పాటు… కనువిందు చేస్తున్న ఇంద్రకీలాద్రి క్షేత్ర నమూనా, శ్రీచక్రం, బొమ్మల కొలువు… సీఐ గుణరామ్‌ ఆధ్వర్యంలో నిత్య పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 10:15 AMకి 3,600 వీక్షణలు
వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇంద్రకీలాద్రి శోభ! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నిత్యం పోలీసుల విధులు, ఫిర్యాదుదారుల రాకపోకలతో సందడిగా ఉండే స్టేషన్‌ ప్రాంగణంలో తొలిసారిగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ప్రతిరూపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వన్‌టౌన్‌ సీఐ గుణరామ్‌ ప్రత్యేక చొరవతో ఆలయ వాతావరణాన్ని తలపించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. అమ్మవారి ప్రతిరూపంతోపాటు శ్రీచక్రం, బొమ్మల కొలువు, ఇంద్రకీలాద్రి క్షేత్ర నమూనా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలంకార సామ్రాట్‌గా పేరొందిన శంకరమంచి ప్రసాద్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.నిష్ణాతులైన శాస్త్ర పండితుల సహకారంతో సంప్రదాయబద్ధంగా బొమ్మల కొలువును రూపొందించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం, కొండ దిగువన ప్రవహించే పవిత్ర కృష్ణానది, సమీపంలోని పానకాల స్వామి క్షేత్రాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక నమూనాలను తీర్చిదిద్దారు. వీటిని తిలకిస్తున్న భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యం ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు సీఐ గుణరామ్‌ తీసుకున్న చొరవను స్థానికులుఅభినందిస్తున్నారు. విధి నిర్వహణతోపాటు భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు చేస్తున్న కృషి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని పలువురు భక్తులు పేర్కొంటున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డిసెంబర్‌ నుంచి ధరల మోత?

17 నిమిషాల క్రితం 3,897

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

2 గంటల క్రితం 3,494

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

2 గంటల క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

2 గంటల క్రితం 4,901