మద్యం మత్తులో మహిళల వీరంగం.. యువకులపై దాడి
• రాజమండ్రి వన్‌టౌన్ పరిధిలో ముగ్గురు మహిళల హల్చల్... • ఇద్దరు యువకులతో అకారణంగా గొడవ.. దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు... • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్...

రాజమండ్రి, ఆగస్టు 26: మద్యం మత్తులో ముగ్గురు మహిళలు హల్చల్ చేస్తూ ఇద్దరు యువకులతో గొడవకు దిగి వారిపై దాడికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది.
రాజమండ్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడి సమీపంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులతో అకారణంగా వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. వివాదం ముదరడంతో యువకులపై దాడికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
కేసును విచారించిన న్యాయస్థానం ముగ్గురు మహిళలకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

