ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

తీరం దాటకముందే 'అర్నాబ్' విధ్వంసం!

వరద ఉద్ధృతికి రెండు చోట్ల కల్వర్టు, వంతెన ధ్వంసం... రాకపోకలు నిలిచిపోయి 20 గ్రామాల ప్రజల అవస్థలు... విద్యుత్తు, తాగునీటి సరఫరాకు అంతరాయం.. జనజీవనం అస్తవ్యస్తం...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 10:55 AMకి 3,273 వీక్షణలు
తీరం దాటకముందే 'అర్నాబ్' విధ్వంసం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

భోగాపురం, అక్టోబర్ 28 : 'అర్నాబ్' తుఫాన్ తీరం దాటకముందే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. వరద ఉద్ధృతికి రెండు ప్రధాన మార్గాల్లో కల్వర్టు, వంతెన దెబ్బతినడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల చెట్లు నేలకొరగగా, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలో కొట్టుకుపోయిన కల్వర్టు! ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో సవరవిల్లి నుంచి కౌలవాడ వెళ్లే మార్గంలో జమ్మయ్యపేట సమీపంలోని కల్వర్టు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. మరోవైపు సవరవిల్లి నుంచి రావాడ మీదుగా భీమిలి మండలం అన్నవరం గ్రామానికి వెళ్లే రహదారిలో జీరుపేట సమీపంలోని వంతెన కూడా దెబ్బతింది. ఈ రెండు మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంధకారంలో గ్రామాలు.. తాగునీటికీ కటకట! భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్తు లేక తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రహదారులు దెబ్బతినడంతో నిత్యావసర సరుకుల రవాణాపైనా ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మరింత నష్టం వాటిల్లుతుందేమోనని ఆందోళన! బుధవారం కూడా భారీ వర్షాలు కొనసాగితే మరిన్ని రహదారులు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దెబ్బతిన్న కల్వర్టు, వంతెనకు అత్యవసర మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించడంతోపాటు విద్యుత్తు, తాగునీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తుఫాను వేళ రోడ్లపైకి ఎస్పీ.. సహాయక చర్యలపై ప్రత్యేక నిఘా!

5 నిమిషాల క్రితం 3,865

తుఫాన్ వర్షాల్లోనూ రోడ్లపైనే ట్రాఫిక్ పోలీసులు!

1 గంట క్రితం 2

తుఫాన్ ముప్పు.. కొండ ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం!

1 గంట క్రితం 4,175

తుఫాన్ వేళ రంగంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము!

1 గంట క్రితం 4,264