ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు జర్నలిస్టుల అభినందన వెల్లువ
విద్యాధరపురంలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఫోరం ప్రతినిధులు... పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపిన జర్నలిస్టు నేతలు... జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానన్న వర్ల రామయ్య...

విజయవాడ, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ప్రతినిధులు శనివారం విద్యాధరపురంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం గౌరవ అధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ, యాత్రలోకం ట్రావెల్ మ్యాగజైన్ సంపాదకుడు తాళ్లూరి అనిల్ కుమార్ తదితరులు వర్ల రామయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
శాసన మండలి సభ్యుడిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపిన ప్రతినిధులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తన సుదీర్ఘ అనుభవంతో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టు ఫోరం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, మీడియా రంగానికి సంబంధించిన అంశాల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు ఫోరం ప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

