డిప్యూటీ చైర్మన్ పదవికి అభ్యర్థిని ప్రకటించిన జగన్
శాసనమండలిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవిపై వైసీపీ కీలక నిర్ణయం తరఫున తూమాటి మాధవరావును అభ్యర్థిగా ప్రకటించిన వైఎస్ జగన్ పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్సీలకు సూచన

అమరావతి: శాసనమండలిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవికి వైసీపీ తరఫున తూమాటి మాధవరావును పోటీకి నిలపాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో జగన్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిత్వానికి ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

