స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం
25వ వార్షికోత్సవ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... అక్షర విద్యాలయం, సాంకేతిక శిక్షణ కేంద్రం సందర్శన... యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ఆరా...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
నెల్లూరు, సెప్టెంబరు 7: స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నెల్లూరు సరస్వతి నగర్‌లోని అక్షర విద్యాలయ పరిపాలన భవనానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, హర్షవర్ధన్, మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు నారాయణ, సత్యకుమార్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం యోగి ఆదిత్యనాథ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించి యువతకు అందిస్తున్న సాంకేతిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. అక్షర విద్యాలయం ద్వారా అందిస్తున్న విద్యా సేవలను ప్రశంసిస్తూ, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తున్న తీరు ఆదర్శనీయమని పేర్కొన్నారు.

