నామినేషన్లపై టీడీపీ నేతల సమాలోచనలు!
గుడివాడలో ఎన్నికల ప్రక్రియపై కీలక సమావేశం... అభ్యర్థుల సమన్వయంపై ప్రత్యేక చర్చ... పాల్గొన్న ఎమ్మెల్యే రాము, రావి వెంకటేశ్వరరావు, ఎం.ఎస్. బేగ్...

గుడివాడ, నవంబర్ 13 : గుడివాడ నియోజకవర్గంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాలోచనలు నిర్వహించారు. శుక్రవారం గుడివాడ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ, పార్టీ అభ్యర్థుల మధ్య సమన్వయం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ నాయకులు, అభ్యర్థుల మధ్య సమన్వయం ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నారు.

