ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ13, నవంబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

మొగల్రాజపురంలో మార్మోగిన అయ్యప్ప శరణుఘోష!

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ... బొండా రవితేజ ఆధ్వర్యంలో కేరళ సంప్రదాయ పూజలు... వేద మంత్రాలు, భజనలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ...

V10TV న్యూస్ డెస్క్ 13 నవంబర్, 2026 8:30 PMకి 8,703 వీక్షణలు
మొగల్రాజపురంలో మార్మోగిన అయ్యప్ప శరణుఘోష! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 13: మొగల్రాజపురం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. భక్తుల శరణుఘోషలు, వేద మంత్రోచ్ఛారణలు, భజనల నడుమ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వగృహంలో యువ నాయకుడు బొండా రవితేజ స్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి గురుస్వామి పర్యవేక్షణలో కేరళ సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు సమర్పించారు. అయ్యప్ప దీక్షాధారులు, శివస్వాములు, భవానీ మాలధారులు, గురుస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా బొండా రవితేజ స్వామి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం, సమానత్వం, భక్తిభావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. 41 రోజుల మండల దీక్షను నియమనిష్ఠలతో ఆచరించడం భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహా పడిపూజలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ముగిసింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నామినేషన్లపై టీడీపీ నేతల సమాలోచనలు!

2 గంటల క్రితం 4,860

15వ వార్డులో విజయం.. అన్వర్‌కు అభినందనం!

2 గంటల క్రితం 6,896

అమరావతి భూములకు బంగారు భవిష్యత్!

4 గంటల క్రితం 6,815

ఏపీకి మరో తుఫాన్ ముప్పు!

4 గంటల క్రితం 5,906