15వ వార్డులో విజయం.. అన్వర్‌కు అభినందనం!
ఎం.ఎస్. బేగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నాయకులు... 15వ వార్డు కౌన్సిలర్‌గా షేక్ అన్వర్ సతీమణి విజయం... ఎన్నికల విజయంపై హర్షం వ్యక్తం చేసిన బేగ్...

విజయవాడ, నవంబర్ 13: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్‌ను జగ్గయ్యపేట పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ సీనియర్ నాయకులు షేక్ అన్వర్, షేక్ అస్లాం, షాదీఖానా చైర్మన్ షహబుద్దీన్ విజయవాడలో బేగ్‌ను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఇటీవల జరిగిన జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 15వ వార్డు కౌన్సిలర్‌గా షేక్ అన్వర్ సతీమణి భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా బేగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ అన్వర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

