ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రామవరప్పాడులో జోరుగా కూటమి ప్రచారం!

పటేల్‌నగర్, హనుమాన్‌నగర్‌లో ఆనంద్ కుమార్ విస్తృత పర్యటన.. భారీ ర్యాలీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు.. కూటమితోనే గ్రామాభివృద్ధి సాధ్యమంటున్న సర్పంచ్ అభ్యర్థి..

V10TV న్యూస్ డెస్క్ 16 నవంబర్, 2026 5:52 PMకి 4,828 వీక్షణలు
రామవరప్పాడులో జోరుగా కూటమి ప్రచారం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 16: రామవరప్పాడు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆనంద్ కుమార్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం పటేల్‌నగర్, హనుమాన్‌నగర్ ప్రాంతాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కూటమి పాలనతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు 22 వేల ఓట్లతో గన్నవరం నియోజకవర్గంలో రామవరప్పాడు కీలక గ్రామపంచాయతీగా నిలుస్తోంది. కూటమి పార్టీల మధ్య కుదిరిన అవగాహన మేరకు జనసేనకు 9, బీజేపీకి 2, టీడీపీకి 9 వార్డులు కేటాయించినట్లు నాయకులు తెలిపారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన ఆనంద్ కుమార్ ప్రచారంలో వేగం పెంచారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288