అతివేగమో.. అజాగ్రత్తో.. యువకుడి బలి
ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టిన కారు… ఘటనాస్థలంలోనే కారు డ్రైవర్ అమర్ సందీప్ మృతి… మరొకరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు…

విజయవాడ, అక్టోబర్ 3: విజయవాడ నోవాటెల్ హోటల్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజిసర్కిల్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామలింగేశ్వరనగర్‌కు చెందిన కారు డ్రైవర్ బల్లిన అమర్ సందీప్ (34) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న బెల్లంకొండ గౌతమ్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం గాలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

