ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ13, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బతికున్నోళ్లని చనిపోయారని చూపిస్తున్నారా?

డెత్ సర్టిఫికెట్ల జారీలో మాయాజాలంపై తీవ్ర ఆరోపణలు... బతికున్న వ్యక్తుల పేర్లతో మరణ ధ్రువీకరణ పత్రాలంటూ వివాదం... ఆస్తుల వ్యవహారాలతో లింకు ఉందా?.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్...

V10TV న్యూస్ డెస్క్ 13 ఆగస్టు, 2026 12:05 PMకి 1,321 వీక్షణలు
బతికున్నోళ్లని చనిపోయారని చూపిస్తున్నారా? — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: బతికున్న వ్యక్తులను చనిపోయినట్లుగా చూపిస్తూ డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో లోపాలు, అధికారుల పర్యవేక్షణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బతికున్న వ్యక్తి పేరుతో మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే దాని ఆధారంగా ఆస్తుల బదలాయింపు, వారసత్వ హక్కులు తదితర వ్యవహారాల్లో అక్రమాలకు అవకాశం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి ఘటనల్లో అసలు దరఖాస్తు ఎవరు చేశారు, సమర్పించిన ఆధారాలేమిటి, వాటిని అధికారులు ఎలా ధ్రువీకరించారనే అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.

డెత్ సర్టిఫికెట్ వంటి కీలకమైన అధికారిక పత్రం జారీ చేసే ముందు మరణానికి సంబంధించిన వివరాలు, ఆసుపత్రి లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తుదారుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే విషయాన్ని అధికారులు తేల్చాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

బతికున్న వారిని మరణించినట్లు నమోదు చేయడం వల్ల బాధిత కుటుంబాలు న్యాయపరమైన, ఆస్తిపరమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టడంతో పాటు అక్రమాలు నిర్ధారణైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నిరుపేద దంపతులకు జీవనోపాధిగా తోపుడు బండి

10 నిమిషాల క్రితం 1

గుడివాడ ఏఎల్‌సీ పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

13 నిమిషాల క్రితం 2

గుడివాడలో రూ.26.52 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు

44 నిమిషాల క్రితం 1,563

మంత్రి నియోజకవర్గంలో తాగునీటి కటకట

52 నిమిషాల క్రితం 1,125