మగ్గంపై చంద్రబాబు చిత్రపటం.. చేనేత దంపతుల అరుదైన కానుక
జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎంకు విశిష్ట బహుమతి. వస్త్రంపై చంద్రబాబు చిత్రాన్ని నేసి అందజేసిన ఎచ్చెర్ల చేనేత కళాకారులు. కళానైపుణ్యాన్ని కొనియాడుతూ దంపతులను అభినందించిన ముఖ్యమంత్రి.

V10 TV | చీరాల
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కళాకారులు నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు అరుదైన కానుకను అందజేశారు.
మగ్గంపై అత్యంత నైపుణ్యంతో వస్త్రంలో చంద్రబాబు చిత్రపటాన్ని నేసి ముఖ్యమంత్రికి బహూకరించారు. ఈ విశిష్ట కానుకను స్వీకరించిన సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తూ, చేనేత దంపతుల ప్రతిభను అభినందించారు.
చేనేత కళాకారుల నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న సీఎం, సంప్రదాయ చేనేత కళను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న వారు చేనేత దంపతుల కళాకౌశలాన్ని ప్రశంసించారు.

